Vijayasai Reddy : రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కానున్న రేవంత్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

Vijayasai Reddy : రేవంత్ రెడ్డికి  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు

CM revanth Reddy ..Vijayasai Reddy

CM revanth_Reddy anumula ..Vijayasai Reddy : తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించాక.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికిసంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కానున్న రేవంత్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. పార్లమెంటులో నా తోటి ఎంపీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ@revanth_anumula గారికి అభినందనలు. జడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి ఎదగటం గమనార్హం. మీరు మీ హామీలను నెరవేర్చగలరని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చగలరని కోరుకుంటున్నాను. అని పేర్కొన్నారు.

కాగా..సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పలికారు. ఏపీ సీఎం జగన్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబులకు ఆహ్వానాలు పలికారు.

అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా ఆహ్వానాలు పలికారు. చిదంబరం, మీరా కుమారి, సుశీల్ కుమార్, కురియన్,తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్,కంచ ఐలయ్యతో పాటు మరికొందరు ఉద్యమకారులకు ఆహ్వానాలు పలికారు.