Arthur - Byreddy
Arthur – Byreddy Siddhartha Reddy : వైసీపీలో మరోసారి వర్గవిబేధాలు బయటపడ్డాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్లెక్సీ కాకా రేగింది. ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గాల మధ్య ప్లెక్సీల కలకలం రేపింది. మంత్రి రోజా రానున్న కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ ప్లెక్సీలు కనపడడం లేదు. ఇండోర్ స్టేడియం ప్రారంభానికి మంత్రి రోజా రానున్నారు.
మంత్రి రోజా స్వాగతం ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫొటో కానరాలేదు. ఎమ్మెల్యే ఆర్థర్ అవమానంగా భావించి కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చని సమాచారం. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్లెక్సీలే అధికంగా ఏర్పాటు చేసిన వైనం నెలకొంది.
Special Buses : తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు
నియోజకవర్గ ప్రథమ పౌరుడుకు ప్రతి సారి అవమానం జరుగుతుందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యే అయినందుకే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని అభిమానులు, అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.