Pm Modi Extends Greetings To Andhra Pradesh People On State's Formation Day
AP Formation Day: ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిగా ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరుగా కొనియాడారు.
అందుకే రాష్ట్రానికి చెందినవారు చాలామంది అనేక రంగాల్లో రాణిస్తున్నారని అభినందించారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి ట్వీట్ తెలుగులో చేయడం ఆస్తకికరంగా మారింది.
Read Also : PM Modi : రోమ్ కు మళ్లీ వెళ్లాలని..ట్రెవీ ఫౌంటెయిన్ లో కాయిన్ విసిరిన మోదీ
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
— Narendra Modi (@narendramodi) November 1, 2021
అంతేకాదు.. ఏపీతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు కూడా ప్రధాని మోదీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా రాష్ట్రాలకు కూడా అక్కడి ప్రజల మాతృభాషలోనే ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
Read Also : Maha Padayatra : నేటి నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర