Maha Padayatra : నేటి నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర

నేటి నుంచి అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు మహా పాదయాత్ర కొనసాగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు.

Maha Padayatra : నేటి నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర

Padayatra

Maha Padayatra of farmers : నేటి నుంచి అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు మహా పాదయాత్ర కొనసాగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర సాగనుంది. తుళ్లూరులో ఇవాళ ఉదయం 9 గంటల 5 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సాగనుంది. డిసెంబర్ 14న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.

నవంబరు 1 మొదటి రోజున తుళ్లూరు నుంచి తాడికొండ వరకు 12.9 కిలో మీటర్లు రైతులు పాదయాత్ర చేయనున్నారు. మొదటి రోజు తుళ్లూరు నుంచి తాడికొండ వరకు పాదయాత్ర సాగుతుంది. తుళ్లూరు నుంచి తాడికొండ, గుంటూరు అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఏటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, అలిపిరి మార్గం గుండా తిరుమలకు యాత్ర చేరుకుంటుంది. తమ పాదయాత్రకు అందరూ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Petrol, Diesel Prices : ఆగని పెట్రో బాదుడు..దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పాదయాత్రలో అన్ని వర్గాలనూ కలుపుకుని వెళతామని, ఇప్పటికే అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వాన పత్రాలు అందించినట్లు తెలిపారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు, జనసేన, సీపీఐ, సీపీఎం మద్దతును తెలిపాయి. కొన్ని కారణాలతో ఉద్యమానికి దూరంగా ఉన్న దళిత జేఏసీ నేతలు కూడా.. మహాపాదయాత్రలో పాల్గొంటామన్నారు.

అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో 47 రోజుల పాటు అమరావతి రైతులు పాదయాత్రకు పిలుపునివ్వగా.. శాంతిభద్రతల దృష్టా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. దీనిపై రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, పోలీసుల అనుమతి నిరాకరణకు సరైనా కారణాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.