ప్రతి మనిషి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి.. నా జీవితంలో కీలక మలుపుల్లో ఇది ఒకటి: లోకేశ్

క్రమశిక్షణతో మెలగాలని, ప్రకృతిని ప్రేమించాలని, తన కుమారుడు దేవాన్ష్‌కు మోదీ చెప్పారని తెలిపారు.

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో ఇవాళ మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొని తాను ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మోదీతో తన భేటీ తన జీవితంలో ఒక కీలక మలుపు అని చెప్పారు.

“ప్రతి మనిషి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. నా జీవితంలో కీలక మలుపుల్లో ప్రధానితో సమావేశం కూడా ఒకటి.
ప్రధాని మోదీతో నా సమావేశం మాటలతో వర్ణించలేను చెప్పలేను. ఎవ్వరికీ ఇవ్వనంత సమయం నాకు ప్రధాని ఇచ్చారు. నాకు గొప్ప ప్రేరణ, స్ఫూర్తినిచ్చారు.

Also Read: ఎట్టకేలకు కన్ఫార్మ్‌ చేసిన కెనడా.. భారత్‌పై హింసాత్మక చర్యలకు కెనడా నుంచి ఖలీస్థానీల పక్కా ప్లాన్.. ఇప్పుడేమంటావ్ ట్రూడో?

మున్ముందు ఇంకా ఎదగాలో అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. మోదీతో సమావేశం అనంతరం ఆయన మాటలు మననం చేసుకుంటూ చాలాసేపు ఆలోచించాను” అని అన్నారు. క్రమశిక్షణతో మెలగాలని, ప్రకృతిని ప్రేమించాలని, తన కుమారుడు దేవాన్ష్‌కు మోదీ చెప్పారని తెలిపారు.

తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని లోకేశ్ అన్నారు. కానీ, తప్పు చేసిన వారిని మాత్రం చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని తెలిపారు. కేంద్ర మంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ తిరిగి గాడిన పడడంపై శ్రద్ధ చూపారని అన్నారు. ఏపీకి అవసరమైన సహాయ సహకారాలు మద్దతునిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నామని తెలిపారు.