ఎట్టకేలకు కన్ఫార్మ్ చేసిన కెనడా.. భారత్‌పై హింసాత్మక చర్యలకు కెనడా నుంచి ఖలీస్థానీల పక్కా ప్లాన్.. ఇప్పుడేమంటావ్ ట్రూడో?
అప్పట్లో ట్రూడో ఏమన్నారు?

PM Narendra Modi with his Canadian counterpart, Mark Carney (Pic: @ANI)
భారత్‌పై కెనడా నుంచి ఖలీస్థానీలు కుట్రలు పన్నుతున్నారని భారత్ ఎన్నో ఏళ్లుగా చెబుతోంది. ఎట్టకేలకు కెనడా ఇప్పుడు కళ్లు తెరినట్టుంది. ఇప్పుడు కెనడా గూఢచారి సంస్థ సీసీఐఎస్ కూడా అదే చెబుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాదం కెనడాలో పాతుకుపోతోందని చెప్పింది. 2024 వార్షిక నివేదికలో సీసీఐఎస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఖలిస్థానీ తీవ్రవాదులు కెనడా నుంచి డబ్బులు సేకరిస్తున్నారని, ప్రొపగాండా జరుపుతున్నారని సీసీఐఎస్ చెప్పింది. భారత్‌పై హింసాత్మక చర్యలకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారని పేర్కొంది. కెనడాను బేస్‌గా చేసుకని, ఖలిస్థానీ తీవ్రవాదులు భారత్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నాని సీసీఐఎస్ తమ నివేదికలో చెప్పింది. ఖలీస్థానీలపై ఇంత స్పష్టంగా, అధికారికంగా కెనడా పేర్కొనడం ఇదే తొలిసారి.
అప్పట్లో ట్రూడో ఏమన్నారు?
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఖలీస్థానీల విషయంలో విషం కక్కిన విషయం తెలిసిందే. 2023లో కెనడా పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత ఇండియా-కెనడా సంబంధాలు దాదాపు తెగిపోయాయి.
తమ దేశ భూభాగంలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నీజ్జార్‌ను ఇండియా హత్య చేసిందని, దీనిపై విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇండియా మాత్రం ఈ ఆరోపణలను నిరాధారమైనవి అంటూ తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య గట్టిగానే రచ్చ జరిగింది.
ఒక గురుద్వార వెలుపల నీజ్జార్ 2023 జూన్ 18న హత్యకు గురయ్యాడు. అతడు నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత. ఈ సంఘటన తర్వాత ఇద్దరు దేశాల మధ్య దౌత్య పరంగా సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. వాణిజ్య చర్చలు జరగేలదు.
కెనడా గూఢచారి సంస్థ సీసీఐఎస్ తాజాగా వెల్లడించిన నివేదిక ద్వారా.. 1980ల నుంచి కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు జరుపుతున్న కుట్రల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కెనడాను ఖలీస్థానీలు స్వేచ్ఛను వాడుకుని ఇండియాపై కుట్రలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
ఇక భారత్-కెనడా సంబంధాలు మెరుగుపడతాయా?
ఇటీవల జీ-7 సమావేశంలో భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అయ్యారు. ఈ సమయంలో కెనడా గూఢచారి సంస్థ సీసీఐఎస్ నుంచి ఖలీస్థానీలపై ఇటువంటి నివేదిక రావడం గమనార్హం. మళ్లీ ఇరు దేశాలు హైకమిషనర్లను నియమించి ట్రేడ్ చర్చల్ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
కార్నీ తాజాగా మాట్లాడుతూ.. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కు అతి పెద్ద భాగస్వామ్యం ఉంది. ఇండియాతో చర్చలు కొనసాగాలి” అని అన్నారు.