PM Modi Speech: ఏపీలో ఏఐ హబ్ పెట్టేందుకు గూగుల్ ముందుకు వచ్చిందన్నారు. అమెరికా వెలుపల ఏపీలోనే గూగుల్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టబోతోందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖ గూగుల్ ఏఐ హబ్ ప్రపంచం మొత్తానికి సేవలు అందించనుందన్నారు. చంద్రబాబు విజన్ ప్రశంసనీయం అన్నారు. దేశ అభివృద్ధికి ఏపీ అభివృద్ధి, ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో ముఖ్యం అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మించుకోవాలన్నారు.
ప్రపంచం భారత్ ను ఈ శతాబ్దపు తయారీ కేంద్రంగా చూస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీని విస్మరించాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఏపీ ముఖచిత్రం మారుతోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కు చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ శక్తిగా నిలువనుందన్నారు.
”స్వాభిమానానికి, సైన్స్ కు కేంద్రం ఏపీ. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉంది. 16 నెలలుగా ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ తో డెవలప్ మెంట్ సాధ్యమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ జరిగి తీరుతుంది. ఇది భారతీయుల శతాబ్దం. అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ఇవి ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తాయి. దేశాభివృద్ధిలో ఇంధన భద్రత ముఖ్యం” అని ప్రధాని మోదీ అన్నారు.
కర్నూలు నన్నూరులో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ జరిగింది. ఇందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 13వేల 430 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. 9వేల 449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. 1704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. 2వేల 276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.
ఇంకా కర్నూలులో 2వేల 880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. 4వేల 920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన చేశారు. 82 కోట్ల రూపాయలతో నిర్మించిన రేణిగుంట-కడప-మదనపల్లె రోడ్డును ప్రారంభించారు. 286 కోట్ల రూపాయలతో నిర్మించిన కడప-నెల్లూరు-చునియంపల్లి రోడ్డును ప్రారంభించారు. 493 కోట్ల రూపాయలతో కొత్తవలస-విజయనగరం మధ్య 4వ లేన్ కు మోదీ శంకుస్థాపన చేశారు. 184 కోట్ల రూపాయలతో పెందుర్తి-సంహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ కు శంకుస్థాపన చేశారు. 960 కోట్ల రూపాయలతో సబ్బవరం-షీలానగర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేశారు.
Also Read: బీసీ రిజర్వేషన్ల అంశం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ