PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్

ఒకే హెలికాప్టర్ లో పీఎం మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్ బిశ్వభూషన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు.

PM Modi  : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సోమవారం భీమవరం రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంట్లో భాగంగా ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రధాని మోడీ తోపాటు ఒకే హెలికాప్టర్లో సీఎం జగన్..గవర్నర్ బిశ్వభూషణ కూడా బయలుదేరారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా భీమవరంలో ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం దాదాపు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయిందా అన్నట్లు ఏర్పాట్లు ఉన్నాయి. రేవుకాళ్ల మండలం నుంచి భీమవరం వైపు ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సోమవారం (జులై 4,2022) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆయ‌న పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. భీమవరంలో క్షత్రియ సేవాసమితి 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఆ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాగా..ఈ కార్యక్రమాలకు వ‌ర్షం అంతరాయం కలిగిస్తోంది. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిని మోడీ, సీఎం జగన్, గవరన్నర్లు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. దాదాపు గంట 15 నిమిషాలు విగ్రహావిష్కరణ, సభ వద్ద ఉంటారు. మ‌రోవైపు, హైద‌రాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు సినీన‌టుడు చిరంజీవి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయ‌న‌ భీమవరం చేరుకుని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ట్రెండింగ్ వార్తలు