చాయ్‌వాలాగా కెరీర్ ప్రారంభించిన నరేంద్ర మోడీ అనతికాలంలో దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన మోడీ.. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంపూర్ణ మెజార్టీతో రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తొలి ఐదేళ్ల పాలనాకాలంలో తనదైన ముద్రవేసుకున్న ప్రధాని.. వందేళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీసి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది
ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రుల ప్రజాదరణపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోడీకి దేశ వ్యాప్తంగా 65శాతంకి పైగా ప్రజలు మద్దతు లభించిందని సర్వే తెలిపింది. మోడీ పనితీరుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని సర్వేలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59.36శాతం మంది భారతీయులు మోడీ పనితీరు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది. 16.71శాతం మంది మోడీ పనితీరుపై అసలు సంతృప్తిగా లేరని తేలింది. 24.01శాతం మంది కొంతమేరకు సంతృప్తి చెందినట్లు తెలిపారు.
ఇక ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో….ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా ఈ సర్వేలో రెండవ స్థానంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగల్,మూడవ స్థానంలో కేరళ సీఎం పిన్నరయి విజయన్,నాల్గవ స్థానంలోఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి,ఐదవ స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నిలిచారు. సీఎం జగన్‌కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. ఇక, లీస్ట్ పాపులర్ సీఎంల లిస్ట్ లో మొదటిస్థానంలో హర్యానా సీఎం ఉండగా,8వ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు.
ప్రధాని పనితీరుతో చాలా సంతృప్తికరంగా ఉన్న 10 రాష్ట్రాలు
1.ఒడిస్సా – 95.6 శాతం
2.హిమాచల్ ప్రదేశ్ – 93.95శాతం
3.చత్తీస్ ఘడ్ – 92.73శాతం
4. ఆంధ్రా – 83.6శాతం
5. జార్ఘాండ్ – 82.97 శాతం
6. కర్ణాటక- 82.56
7. గుజరాత్- 76.42
8. అస్సాం- 74.59
9.తెలంగాణ- 71.51
10. మహారాష్ట్ర- 71.48