PM Modi: ప్రధాని మోదీ అమరావతి టూర్.. ఏఏ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారంటే.. పూర్తి వివరాలు ఇలా..

ప్రధాని నరేంద్ర మోదీ మే2 (శుక్రవారం) న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి అభివృద్ధి పనులతోపాటు.. కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

PM Modi Amaravati Tour

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మే2 (శుక్రవారం) న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.25గంటలకు ప్రధాని సచివాలయం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభిస్తారు. రాజధాని ప్రాజెక్టులతోపాటు పెద్దెత్తున కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అమరావతిలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. బహిరంగ సభకు భారీగా ప్రజలను తరలించేందుకు కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: టీడీపీ నేత దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో సందడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్.. ఫొటోలు

ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వివరాలు..
♦ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతిలో చేపట్టే రూ. 49,040 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
♦ శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతోపాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు.
♦ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
♦ రాజధాని ప్రాజెక్టులతోపాటు పెద్దఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
♦ డీఆర్డీఓ, డీపీఐఐటీ, రైల్వేస్, NHAIకు సంబంధించిన రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
♦ నాగాయలంకలో దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు, అదేవిధంగా వైజాగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
♦ రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు, మరో రూ. 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చ్యువల్ పద్దతిలో మోదీ శంకుస్థాపనలు చేస్తారు.
♦ రూ.3680 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
♦ రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట – విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, కెయిఎఫ్ పాణ్యం లైన్ లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.