YS Jagan Mohan Reddy Birthday: సీఎం జ‌గ‌న్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పీఎం నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

YS Jagan Mohan Rreddy Birthday

AP Cm YS Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాడవాడలా కేక్ లు కట్ చేస్తూ జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు జగన్ కు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. జగన్ సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని ప్రధాని పేర్కొన్నారు.

Also Read : Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్‌కు వాళ్ల కష్టాలు కనిపించలేదా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ తెలిపారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తోపాటు  పలువురు వైసీపీ నేతలు, ఇతర పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.