Viral Video: ‘నా సోదరులారా.. కిందికి దిగండి’ అంటూ ‘ప్రజాగళం’ సభలో ప్రధాని మోదీ విజ్ఞప్తి

Viral Video: ఈ సభకు లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ ‘ప్రజాగళం’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. సమావేశం ప్రాంతంలో ప్లెడ్ లైట్ల కోసం ఏర్పాటు చేసిన కర్రలపైకి కొందరు యువకులు ఎక్కారు.

మోదీ ప్రసంగం మొదలుపెట్టిన సమయంలో వారిని చూశారు. వాటి నుంచి కిందికి దిగాలని వారికి మోదీ సూచించారు. సోదరులారా కిందికి దిగండి అని అన్నారు. దీంతో ఆ యువకులు కిందికి దిగారు. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకు ముందు బొప్పూడి సభా ప్రాంగణం వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు.

మరోవైపు, ఈ సభకు లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. వారికి లోకేశ్, బాలకృష్ణ సెల్ఫీలు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 6.50 నిమిషాలకు బొప్పూడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో గన్నవరం వెళ్తారు మోదీ. రాత్రి 7 గంటల 20 నిమిషాలకు గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
.

Pm Modi Telangana Tour : మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ