పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధించిన పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

West Godavari District : పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సైనిక ఉద్యోగికి కేటాయించిన స్థలం విషయంలో మంగళవారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైనిక ఉద్యోగికి కేటాయించిన స్థలంలో స్థానికులు అంబేద్కర్ బొమ్మను పెట్టారు. దీంతో అడ్డుకున్న సైనిక ఉద్యోగి భార్యపై స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు. అధికారులు హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు.

Also Read : రాయలసీమలోని ఆ ప్రాంతంలో మాత్రమే వజ్రాలు దొరకడానికి కారణమేంటి? అసలక్కడ భూమిలో రత్నాలెలా వచ్చాయి?

సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మీ గాయాలతోనే తన స్థలంలో నిరసన చేపట్టింది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, పోలీసులపైనా స్థానికులు రాళ్ల దాడిచేశారు. పెంటపాడు ఎస్ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో రావిపాడు గ్రామంలో రాత్రి నుంచి 144 సెక్షన్ కొనసాగుతుంది. రావిపాడు గ్రామాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అజిత సందర్శించారు. సిబ్బందికి సూచనలు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు