Ongole Flexi War : ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్ గ్రూప్ వార్..! జనసేన నేత ఫ్లెక్సీలు చించివేత..!

అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

Ongole Flexi War : ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్ గ్రూప్ వార్ నడుస్తోంది. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బర్త్ డే ఫ్లెక్సీని దుండగులు చింపేశారు. దీంతో ఓ వర్గం నాయకులు, బాలినేని అనుచరుల మధ్య వివాదం రాజుకుంది. బాలినేని బర్త్ డే సందర్భంగా ఒంగోలులో పలు చోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు. అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన అనుచరగణం నిన్న ఒంగోలు పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే, నిన్న అర్థరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చించేశారు. దీంతో వివాదం రాజుకుంది. గతంలో వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్న సందర్భంగా పట్టణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. కలెక్టరేట్ ఎదుట, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం కూడా జరిగింది. వాటిని మున్సిపల్ ఆఫీస్ కు తరలించారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.

ఇలా రెండు మూడు సందర్భాల్లో టౌన్ లో ఏర్పాటు చేసిన బాలినేని ఫ్లెక్సీలను కూటమి పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో తొలగించారు. జనసేనలోకి బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత బాలినేని ఒంగోలు పట్టణానికి దూరమయ్యారు. తాజాగా జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం మరోసారి వివాదాస్పదంగా మారింది. బాలినేని వ్యతిరేకులైన కూటమి పార్టీలోని నాయకులు, కార్యకర్తలే ఈ పని చేశారా? లేక ఇతరులు ఎవరైనా ఈ పని చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

 

Also Read : వైసీపీకి వరుస షాకుల వెనుక రీజన్‌ ఏంటి? ఉన్నట్టుండి ఆ పార్టీ నేతలు ఎందుకు గుడ్‌బై చెబుతున్నారు?