AP TDP : ఉత్తరాంధ్ర రక్షణపై టీడీపీ చర్చ, వైసీపీ హయాంలో ఏం జరిగింది ?

ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ రాజుకుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు విశాఖలో సమావేశం నిర్వహించనున్నారు.

Ap Tdp

AP TDP Meeting : ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ రాజుకుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు విశాఖలో సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక టీడీపీ రాష్ట్ర  నాయకత్వం హాజరు కానుంది. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపైన చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని టీడీపీ చెబుతుంటే.. చంద్రబాబే ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమని  వైసీపీ ఆరోపిస్తోంది.

Read More : Prakasam : పెళ్లి సంబంధం కుదుర్చుకుని వస్తున్నారు…అంతలోనే

టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు ఇప్పుడు పూర్తి స్థాయి కార్యాచారణకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే లక్ష్యంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముందుగా టీడీపీకి ఎంతో పట్టున్న ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రెండున్నరేళ్ల కాలంలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో చర్చ జరుపనున్నారు టీడీపీ నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటుగా మాజీ అధ్యక్షులు కళా వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొననున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

Read More : Srisailam : యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు జరిగే అన్యాయం గురించి చర్చిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరుతో టీడీపీ మళ్లీ రాజకీయం ప్రారంభించిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ.. ఉత్తరాంధ్రాకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం ఉత్తరాంధ్ర కావాలి తప్ప.. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు, టిడిపి నేతలకు లేదన్నారు.