Srisailam : యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 

Srisailam : యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన

Construction Of The Yagashala In Srisailam

Yagashala In Srisailam : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.  దాతల సహకారంతో…ప్రస్తుతం ఉన్న యాగశాల వద్దనే రాతితో కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. 2021, ఆగస్టు 29వ తేదీ ఆదివారం యాగస్థలంలో అర్చకులు, వేదపండితులు నిర్మాణ సంకల్పాన్ని, పూజలు చేశారు.

మహాగణపతి పూజ, పుణ్యహవచనం, నవగ్రహమండపారాధాన, వాస్తుమండపరాధన, వాస్తుపూజ, శంకపూజ, యంత్ర ప్రతిష్టాపన ఇతర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లవన్న మాట్లాడుతూ…దాతల సహకారంతో రాతి యాగశాల నిర్మిస్తున్నట్లు, ఇందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

కృష్ణశిలతో యాగశాల నిర్మాణం జరుగుతోందని, ఈ నిర్మాణం పూర్తయితే..ఇక్కడ ఒకేసారి 50 జంటలు హోమాలు నిర్వహించేందుకు వీలుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పండితులు, అర్చకులు, దాతలు పర్వతయ్య, శారదాదేవి ఇతరులు పాల్గొన్నారు.