ఏపీలో ఏం జరగబోతోంది? బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఇస్తామంటున్న టీడీపీ, వైసీపీ..! ఏంటా న్యూస్..

ఏపీలో నిత్యం ఏదో ఒక సమస్యతో రాజకీయ మంటలు మండుతూనే ఉన్నాయి.

Tdp Vs Ysrcp Twitter War (Photo Credit : Google)

Tdp Vs Ysrcp : అక్టోబర్ 24వ తేదీ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో ఏం జరగబోతోంది? అధికార, ప్రతిపక్షాలు ఏం కుండబద్దలు కొట్టబోతున్నాయి? కేవలం ట్విట్టర్ వార్ మాత్రమేనా? లేక నిజంగా బిగ్ బ్లాస్టింగ్ రాబోతోందా? టీడీపీ, వైసీపీ పార్టీలు ట్విట్టర్ లో పెట్టిన పోటాపోటీ పోస్టర్ల వెనుక అసలు రహస్యం ఏంటి. ఇప్పుడు ఏపీలో దీనిపైనే చర్చ నడుస్తోంది.

ఏపీలో నిత్యం ఏదో ఒక సమస్యతో రాజకీయ మంటలు మండుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు తార స్థాయికి వెళ్తున్నాయి. ఒకరిపై ఒకరు పెట్టుకునే పోస్టులకు హద్దులు కూడా ఉండవు. ఇప్పుడు మరోసారి రెండు పార్టీల మధ్య పోస్టర్ల యుద్ధం జరుగుతోంది. టీడీపీ, వైసీపీ పెట్టిన పోస్టర్స్ చర్చనీయాంశంగా మారాయి.

రేపు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్ ప్లోజ్.. చూస్తూనే ఉండాలంటూ టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ కు కౌంటర్ గా వైసీపీ కూడా బిగ్ రివీల్.. ట్రూత్ బాంబ్ డ్రాపింగ్ అని పోస్టర్ విడుదల చేసింది. దీంతో రేపు ఏం జరగబోతోంది? అని ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.

సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా సస్పెన్స్ గా విడుదల చేసిన పోస్టర్ల వెనుక అంత పెద్ద విషయం ఏంటా అని ఆరా తీస్తున్నారు. అయితే, మొదట్లో ఈ పోస్టర్స్ ను చూసి సోషల్ మీడియా వార్ మాత్రమే అని లైట్ తీసుకున్నప్పటికీ.. ఏదో సీరియస్ మ్యాటర్స్ ఉన్నాయని అంటున్నారు ఆయా పార్టీల కీలక నేతలు. సబ్జెక్ట్ మాత్రం లీక్ అవకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. మరి మధ్యాహ్నం 12 గంటలకు ఏం బ్లాస్టింగ్ ఉండబోతోందో చూడాలి.

Also Read : ఇదే పాలన కొనసాగితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది- సీఎం చంద్రబాబుకి జగన్ వార్నింగ్..