Ap Rains: ఏపీలో ద్రోణి ప్రభావం.. రేపు భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం.. ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్(Ap Rains)లో రాబోయే 24 గంటల్లో వాతావరణం చల్లబడనుంది.
Disaster Management warns of heavy rains across Andhra Pradesh tomorrow
-
రేపు పలు జిల్లాలకు వర్ష సూచన.
-
పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-
గూడూరులో అత్యధిక వర్షపాతం నమోదు.
Ap Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో రాబోయే 24 గంటల్లో వాతావరణం చల్లబడనుంది. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా మంగళవారం పలు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావం తీవ్రంగా ఉండనుంది. జిల్లాల వారీగా వర్ష సూచనవిపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Ap Rains) కురిసే అవకాశం ఉంది.
Hyderabad Rains: సైబరాబాద్ అలెర్ట్.. నేడు భారీ వర్షాల సూచన.. వాహనదారులకు హెచ్చరికలు
* కోస్తాంధ్ర: కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడవచ్చు.
* రాయలసీమ: కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు:
ఉరుములు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడేటప్పుడు ఎవరూ చెట్ల కింద గానీ, భారీ హోర్డింగ్స్ (ప్రకటనల బోర్డులు) వద్ద గానీ నిలబడకూడదని స్పష్టం చేశారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడితే వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు పిడుగులు పడే సమయంలో బయట ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో నమోదైన తాజా వర్షపాతం:
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. గూడూరు (నెల్లూరు జిల్లా) 40.5 మి.మీ, నెమలికల్లు (పల్నాడు జిల్లా)25.5 మి.మీ, వెంకటగిరి (తిరుపతి జిల్లా)24.2 మి.మీ, రత్నగిరి (శ్రీసత్యసాయి జిల్లా)22.0 మి.మీ, హంపాపురం (అనంతపురం జిల్లా)22.0 మి.మీ, ఘంటసాల (కృష్ణా జిల్లా)20.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
