Pothina Mahesh : ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లపై జనసేన నేత పోతిన మహేష్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు

మహేష్ మాట్లాడుతున్న సమయంలో ఇక ఆపాలంటూ ఫెస్టివల్ ఇంఛార్జ్ ఆజాద్, పోలీసులు కోరారు. రాజకీయాలకు ఇది వేదిక కాదంటూ మీడియా పాయింట్ నుండి మహేష్ ను పోలీసులు పంపించేశారు.

Pothina Mahesh - Karnati Rambabu

Pothina Mahesh – Karnati Rambabu : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని జనసేన అధికార ప్రతినిది పోతిన మహేష్ దర్శించుకున్నారు. ఉచిత క్యూలైన్ లో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం పోతిన మహేష్ ప్రొటొకాల్ మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లపై విమర్శలు చేశారు. పోతిన మహేష్ మాట్లాడుతుండగా సమాచారశాఖ అధికారులు మైక్ ఆఫ్ చేశారు.

దీంతో మైక్ ఆఫ్ చేసి మహేష్ మాట్లాడారు. తాను రాజకీయాలు మాట్లాడడం లేదన్నారు. కేవలం ఏర్పాట్లను మాత్రమే ఎత్తిచూపించానని చెప్పారు. మహేష్ మాట్లాడుతున్న సమయంలో ఇక ఆపాలంటూ ఫెస్టివల్ ఇంఛార్జ్ ఆజాద్, పోలీసులు కోరారు. రాజకీయాలకు ఇది వేదిక కాదంటూ మీడియా పాయింట్ నుండి మహేష్ ను పోలీసులు పంపించేశారు.

Vijayawada : దుర్గగుడి పాలకమండలి కీలక తీర్మానాలు.. వృద్ధులు, వికలాంగులకు వాహనాలు.. ఏడాదిలోపు చిన్న పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్

తాను తప్పుగా ఏం మాట్లాడలేదని, కాంట్రాక్టుల‌ మీద పెట్టిన దృష్టి ఏర్పాట్లు, అలంకరణ మీద పెట్టాలని మాట్లాడితే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం సాఫీగా సాగుతుందన్నారు. రాజకీయంగా కావాలనే కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయాలు చేసుకోవాలంటే కొండ దిగువన చేసుకోండి..అమ్మవారి చెంత కాదు అని సూచించారు. అమ్మవారి ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడొద్దన్నారు. పోతిన మహేష్ కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దసరాలో అన్ని ఆన్ లైన్ టెండర్లను పిలిచి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.

Durga Temple: దుర్గగుడి పాలకమండలి  కీలక నిర్ణయాలు.. రూ.300 దర్శనానికి ఉచితంగా ఒక లడ్డూ.. ఇంకా..

వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం సజావుగా అయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఏమైనా సూచనలివ్వండి.. వాటిని పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. అంతేకాని బాగున్న ఏర్పాట్లను తీసుకొచ్చి రాజకీయం చేయవద్దన్నారు.