Pothina Mahesh: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యం ఇదే: పోతిన మహేశ్
అందులోనూ 10 మంది మాత్రమే జనసేన నాయకులు ఉన్నారని పోతిన మహేశ్ తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : April 24, 2024 / 04:42 PM IST
Pothina Mahesh
మరో 25 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. భూములు దోచేయాలని, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి నుంచి కేవలం 21 సీట్లిస్తే చాలన్న స్థాయికి పవన్ కల్యాణ్ పడిపోయారని చెప్పారు.
ప్రజలనే నమ్ముకుని సీఎం వైఎస్ జగన్ సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పోతిన మహేశ్ అన్నారు. ఏపీలోని తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ బస్సు యాత్రకి ప్రజలు బ్రాహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏపీలో కూటమిని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు.
అందులోనూ 10 మంది మాత్రమే జనసేన నాయకులు ఉన్నారని పోతిన మహేశ్ తెలిపారు. పవన్ కల్యాణ్ దిగజారి పోయారని చెప్పారు. ఎలాపడితే అలా ఉంటానంటే సమాజం ఒప్పుకోదని అన్నారు. మహిళలంటే పవన్ కి చిన్న చూపని తెలిపారు. వారిని గౌవించడం పవన్‌కు తెలియదని చెప్పారు. చిరంజీవిని పవన్ అవమానించారని అన్నారు.
అవసరం కాబట్టే ఇప్పుడు చిరంజీవి గుర్తుకు వచ్చారని పోతిన మహేశ్ చెప్పారు. పవన్ కి ప్రజల నుంచి చెప్పు దెబ్బలు తప్పవని వ్యాఖ్యానించారు. సినిమా డైలాగ్స్ చెబితే ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం ఏంటని ప్రశ్నించారు.
Also Read: జగన్ దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయని మీరు అంటున్నారు.. పవన్‌కి ఇదే నా ప్రశ్న: వైసీపీ నేత అడపా శేషు
