జగన్ దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయని మీరు అంటున్నారు.. పవన్‌కి ఇదే నా ప్రశ్న: వైసీపీ నేత అడపా శేషు

Adapa Seshu: జగన్ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి సీఎం అయ్యారని పవన్ చెప్పారు. రాష్ట్రంలో..

జగన్ దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయని మీరు అంటున్నారు.. పవన్‌కి ఇదే నా ప్రశ్న: వైసీపీ నేత అడపా శేషు

Adapa Seshu

Updated On : April 24, 2024 / 4:47 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. పవన్‌ని ఓ ప్రశ్న అడుగుతున్నానని, ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల ప్రకటన ఉంటుంది చూసుకో వచ్చుకదా? అని అన్నారు.

తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో అడపా శేషు మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాటల్లో నిజం లేదని చెప్పారు. ఎవరో స్క్రిప్ట్ రాసి ఇస్తే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. 2014లో చంద్రబాబుని పొగిడిన పవన్ కల్యాణ్ 2019లో చంద్రబాబు, లోకేశ్ ని తిట్టారని చెప్పారు. నమ్ముకున్న కులాన్ని, జనసైనికులని ప్యాకెజ్ కోసం పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

జగన్ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి సీఎం అయ్యారని పవన్ చెప్పారు. రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు జగన్ అని అన్నారు. ఏపీలో కొత్త సంస్కరణలు తెచ్చి దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా జగన్ చేశారని తెలిపారు. రాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందుతుంటే జగన్‌ని పవన్ ఏమని ప్రశ్నిస్తారని నిలదీశారు.

టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి చేస్తే ఆ విషయాన్ని పవన్ ఎందుకు అడగలేదని పవన్ చెప్పారు. చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారారని అన్నారు. జనాలు కూటమి నేతలను నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. కాపు సంఘాలు, నాయకులు అర్థం చేసుకోవాలని, జగన్ వల్లే వారు అభివృద్ధి చెందుతారని చెప్పారు. పవన్ కి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Also Read: నామినేషన్ వేసి కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి