నామినేషన్ వేసి కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి

Kethireddy: మరి ఇక ఆయనకెందుకు ఓటు వేయాలని, ఆయనను ఎలా నమ్మాలని కేతిరెడ్డి ప్రశ్నించారు.

నామినేషన్ వేసి కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి

Updated On : April 24, 2024 / 4:46 PM IST

Kethireddy Venkatarami Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ధర్మవరం వీధుల్లో నుంచి భారీ ర్యాలీగా కేతిరెడ్డి వెళ్లారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ… బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తీరు బాగోలేదని చెప్పారు. ఆయన కులం పేరుపై కూడా అసత్యాలు చెబుతున్నారని తెలిపారు. ఆయనకు భార్య లేదని ఆఫిడవిట్ లో చెప్పారని, కానీ ఆయన సతీమణి ధర్మవరంలో ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పారు.

తాను లేకపోయినా శ్రీరామ్ ఉంటాడంటూ సత్యకుమార్ అంటున్నారని, మరి ఇక ఆయనకెందుకు ఓటు వేయాలని, ఆయనను ఎలా నమ్మాలని కేతిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా గతి లేకపోవడంతోనే సత్యకుమార్ ధర్మవరం వచ్చారని అన్నారు. ఎన్నికలు అయిపోగానే ఆయన ధర్మవరంలో ఉండరని తెలిపారు. గతంలో ఎప్పుడూలేని మెజారిటీతో తాను ధర్మవరంలో గెలుస్తానని కేతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగియనుంది. చివరి రెండు రోజులు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. పోలింగ్ మే 13న జరగనుంది.

Also Read: పద్మారావు నామినేష‌న్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు..? : రేవంత్ రెడ్డి