చంద్రబాబుకు కేఏ పాల్ సూటిప్రశ్న..! రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కీలక వ్యాఖ్యలు

గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ..

KA Paul

KA Paul : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నా మద్దతు ఉంటుంది.. నా మద్దతు తీసుకోకుంటే ఏపీకి కంపెనీలు రావని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ రెండో తేదీన లాస్ ఎంజెల్సులో జరిగే గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ జరుపుతున్నాం. ఈ సమావేశానికి మద్దతివ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నామని కేఏ పాల్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు కూడా బాధ పడ్డారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి. రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పని చేయడానికి నేను సిద్దం. సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు వస్తే అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిపిస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు.

Also Read : కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య.. జ‌గ‌న్‌కు లోకేశ్ సీరియస్ వార్నింగ్

రేవంత్ రెడ్డి అమెరికావెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని పాల్ అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి చంద్రబాబుకు నేను సహకరిస్తాను. వివిధ దేశాల కౌన్సిల్ జనరల్స్ తో చంద్రబాబు భేటీ అవుతున్నా.. ఉపయోగం లేదు. ఆయా దేశాధినేతలు.. పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలే పెట్టుబడులు ఇవ్వగలరు. నేను వాళ్లందర్నీ కలిపిస్తాను. నా మద్దతు తీసుకోకుంటే ఏపీకి కంపెనీలు రావని పాల్ అన్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలలోగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలను. చంద్రబాబు ఏపీ సీఎం కాబట్టి లాస్ ఏంజెల్స్ లో జరిగే గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ వస్తేనే ఇది సాధ్యమవుతుందని పాల్ పేర్కొన్నారు.

Also Read : Bunny Vasu – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా వచ్చి.. ఇప్పుడు ఆయనతో పొలిటికల్ గా నడుస్తున్నాను..

ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఎఫ్సీఆర్ఏ ఇస్తే నా ట్రస్ట్ ద్వారా నెల రోజుల్లో రూ. 8వేల కోట్లు తెస్తానని కేఏ పాల్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా జస్టిస్ శేషసాయి చక్కటి తీర్పు ఇచ్చారు. ఖజానాలో డబ్బుల్లేవని.. హామీలు అమలు చేయలేమని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు.. కానీ ఓట్లు పడవని చెప్పలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖజానా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. నేను ప్రపంచ కుబేరులను రాష్ట్రానికి తెచ్చాను. కేరళకు కొన్ని పెట్టుబడులు ఇప్పించాను. నేను చంద్రబాబును కలవడానికి సిద్దం.. నన్ను కలవడానికి చంద్రబాబు సిద్దమా..? అంటూ పాల్ ప్రశ్నించారు. ఎన్డీఏకు మద్దతిచ్చే సందర్భంలోనే చంద్రబాబు కొన్ని డిమాండ్లు పెట్టి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేదని పాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు