Bunny Vasu – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా వచ్చి.. ఇప్పుడు ఆయనతో పొలిటికల్ గా నడుస్తున్నాను..
తాజాగా బన్నీ వాసు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు.

Bunny Vasu Interesting Comments on Pawan Kalyan goes Viral
Bunny Vasu – Pawan Kalyan : నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ ఫ్రెండ్ గా అందరికి తెలిసినా గీత ఆర్ట్స్ లో నిర్మాతగా ఎదిగారు. బన్నీ వాసు జనసేనలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా బన్నీ వాసుని ఎన్నికల్లో పోటీ చేయమని అడిగారు. అయితే బన్నీ వాసు పోటీకి సిద్ధంగా లేడని ఆగిపోయాడు. కానీ 2029 లో బన్నీ వాసు జనసేన నుంచి పోటీ చేస్తాడని గతంలో తెలిపారు.
తాజాగా బన్నీ వాసు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. తాజాగా ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్లో బన్నీ వాసు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. జానీ సినిమాకు ఒక యానిమేటర్ గా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడు గీత ఆర్ట్స్ లో నిర్మాత అయ్యాను. పాలకొల్లు నుంచి వచ్చిన నేను చిన్నప్పట్నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. ఖుషి సినిమా చూసి మా నాన్న కార్ తీసుకొని ఆయన్ని చూడటానికి హైదరాబాద్ వచ్చాను. ఇవాళ ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఆయనతో పాటు ఆయన వెనకాల పొలిటికల్ జర్నీలో భాగమవుతాను. ఆయన అడుగులో అడుగు వేస్తూ వెళ్లగలుగుతున్నాను అంటే చాలా పుణ్యం చేసి ఉంటాను అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారితో మంచి జర్నీ నాది అని తెలిపారు.