NTR – Pithapuram : పిఠాపురంలో ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ఈవెంట్ కోసం.. ఎన్టీఆర్‌ని పర్మిషన్ అడిగితే ఏమన్నారంటే..

బన్నీ వాసు ఈవెంట్లో మాట్లాడుతూ పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెడతామంటే ఎన్టీఆర్ ఏమన్నారో తెలిపారు.

NTR – Pithapuram : పిఠాపురంలో ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ఈవెంట్ కోసం.. ఎన్టీఆర్‌ని పర్మిషన్ అడిగితే ఏమన్నారంటే..

NTR Comments on his Cousin Narne Nithin Aay Movie Trailer Launch in Pithapuram

Updated On : August 14, 2024 / 8:23 AM IST

NTR – Pithapuram : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఆగస్టు 15న ఆయ్ సినిమాతో రాబోతున్నాడు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించారు. పిఠాపురంలో ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ఈవెంట్ నిర్వహించడంతో ఈ ఈవెంట్ అందరికి ఆసక్తిగా మారింది.

తాజాగా దీని గురించి ఈ సినిమా నిర్మాత బన్నీ వాసు దీనిపై మాట్లాడాడు. ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా బన్నీ వాసు ఈవెంట్లో మాట్లాడుతూ పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెడతామంటే ఎన్టీఆర్ ఏమన్నారో తెలిపారు.

Also Read : Veeranjaneyulu Viharayatra : ‘వీరాంజనేయులు విహారయాత్ర’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో కచ్చితంగా చూడాల్సిన సినిమా..

బన్నీ వాసు మాట్లాడుతూ.. మా హీరో నార్నె నితిన్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఏ రోజు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. నన్నే ఆయన బాగా చూసుకున్నారు. చాలా కష్టపడి చేసారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ పిఠాపురంలో జరిగిన సంగతి తెలిసిందే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఈవెంట్ పెట్టాలి అని పెట్టాము. కానీ ఈ విషయం వర్క్ హడావిడిలో పడి నితిన్ గారికి చెప్పడం మర్చిపోయి అనౌన్స్ చేసేసాను. హీరోని అడక్కుండానే పిఠాపురం ఈవెంట్ అనౌన్స్ చేశాను అని ఫీల్ అయ్యాను. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఈ విషయం చెప్తే ఏమనుకుంటాడో అని అనుకున్నాను. కానీ ఎలాగోలా ఫోన్ చేసి పిఠాపురంలో ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం ఎన్టీఆర్ గారికి ఒకసారి చెప్తారా అని అడిగితే ఆయన వెంటనే ఎన్టీఆర్ కి కాల్ చేసి నాకు కాల్ చేసాడు. అయన నాకు ఒకటే చెప్పాడు. సర్.. నేను మా బావ గారిని అడిగాను. ఈ విషయం చెప్పాను. సినిమాకు ఉపయోగపడుతుంది, ప్రొడ్యూసర్ కి లాభం వస్తుంది అంటే నువ్వు ఏమి ఆలోచించకుండా వేళ్ళు అని అన్నారని చెప్పాడు. నిజంగా ఎన్టీఆర్ గారికి హ్యాట్సాఫ్. సినిమాని సినిమాలా చూసినందుకు చాలా థ్యాంక్యూ సర్ అని అన్నారు. దీంతో బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని అభినందిస్తున్నారు.