Prashant Kishor: చంద్రబాబుతో 3 గంటలపాటు చర్చించాక ప్రశాంత్ కిశోర్ ఏం చెప్పారో తెలుసా?

ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ... అందుకే చంద్రబాబును కలిశానని చెప్పారు. చంద్రబాబు సీనియర్ నాయకుడని..

Prashant Kishor-Chandrababu Naidu

Prashant Kishor: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య సమావేశం ముగిసింది. మూడు గంటలపాటు వారి మధ్య సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు మూడు నెలల క్రితం నుంచే పీకేతో టచ్ లో ఉంది టీడీపీ. గతంలోనే రెండుసార్లు పీకేతో చంద్రబాబు భేటీ అయినట్లు తెలుస్తోంది.

అలాగే, చాలా రోజులుగా లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు పీకే. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నారా లోకేశ్-ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ… మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశానని చెప్పారు. చంద్రబాబు సీనియర్ నాయకుడని.. అందుకే చంద్రబాబును వచ్చి కలిశానని చెప్పుకొచ్చారు.

వీటిపై నిర్ణయాలు?

ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుతో పీకే చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో సోషల్ మీడియా క్యాంపెయిన్ బాధ్యతలను ఇక నుంచి పీకే టీమ్ హ్యండిల్ చేసే అవకాశం ఉంది.

ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల రూపకల్పనకు పీకే ప్రణాళికలు వేయనున్నట్లు సమాచారం. చంద్రబాబు- పవన్ కల్యాణ్ కాంబినేషన్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై పీకే ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. పీకే గైడెన్సులో రాబిన్ శర్మ టీమ్ కూడా పనిచేయనుంది.

Prashant Kishor: ఎన్నికల వేళ విజయవాడకు ‘వ్యూహకర్త’ ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుతో భేటీ