Priests robbed temple : దేవుడికే శఠగోపం పెట్టిన ఆలయ అర్చకులు

కర్నూలు జిల్లా శ్రీ గాదె లింగప్ప ఆలయ అర్చకులు దొంగల అవతారమెత్తారు. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టారు.

Priests Robbed Temple

Priests robbed at Sri Gade Lingappa temple : కర్నూలు జిల్లా శ్రీ గాదె లింగప్ప ఆలయ అర్చకులు దొంగల అవతారమెత్తారు. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టారు. ఆలయ హుండీనే దోచుకొని ప్రజలకు షాక్‌ ఇచ్చారు. హాలహర్వి మండలం శ్రీ గాదె లింగప్ప ఆలయంలో అర్చకులు దొంగతనానికి పాల్పడ్డారు. భక్తులిచ్చిన కానుకలను చోరీ చేశారు. దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

గత నెలలో జరిగిన ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతనం గురించి ఎండోమెంట్ అధికారులకు తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు, ఆలయ అర్చకులు కుమ్మక్కై ఈ చోరీకి పాల్పడ్డారని భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.