“ఇలా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే” అంటూ బండ్ల గణేశ్ కామెంట్లు.. ఇంతకీ ఎవరికి కౌంటర్‌ ఇచ్చినట్టు?

"మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి" అని అన్నారు.

bandla ganesh comments

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఎక్స్‌ వేదికగా చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. అసలు ఆయన ఎవరికి ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారో కూడా తెలియకపోయినా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి నెటిజన్లు వాటిపై అంచనాలు వేస్తుంటారు.

తాజాగా, బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి” అని అన్నారు.

బండ్ల గణేశ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఈ ట్వీట్‌ చేశారు. అయితే, నెటిజన్లు కొందరి పేర్లను ప్రస్తావిస్తూ వారి గురించే బండ్ల గణేశ్ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు.

Also Read: జనసేన ఫిర్యాదులతో దువ్వాడపై కేసులు నమోదు.. హైదరాబాద్‌లో మకాం పెట్టినా ఆయనపైనే ఫోకస్ ఎందుకు?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు గురించే బండ్ల గణేశ్ ఈ ట్వీట్ చేశారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపునకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి ఖర్మ అని నాగబాబు జనసేన 12వ ఆవిర్భావ సభలో అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ దీనిపైనే స్పందించారా? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అలాగే, పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ తాజాగా పలు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో ప్రకాశ్‌ రాజ్‌కే బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారని కూడా కొందరు అంన్నారు. బండ్ల గణేశ్ ఎవరికి ఉద్దేశించిన ఆ కామెంట్లు చేశారో ఆయనకే తెలియాలి.