Nara Lokesh
నారా లోకేశ్… టీడీపీలో ఆయన పాత్రపై 2019కి ముందు. ఆ తర్వాత అన్నట్లుగా చెప్పొచ్చు. 2019 అంతకంటే ముందు కూడా టీడీపీకి సేవలు అందించారు లోకేశ్. 2019కు ముందే మంత్రి అయినప్పటికీ పార్టీలో పెద్దగా జోక్యం చేసుకోలేదు లోకేశ్. ఇక 2019లో పార్టీ అపోజిషన్లోకి వచ్చినప్పటి నుంచి సంక్షోభాలను అవకాశంగా మల్చుకుని పనిచేస్తూ వచ్చారు లోకేశ్. పడిలేచిన కెరటంగా టీడీపీకి తిరిగి విజయాన్ని అందించడంలో ఆయనది ప్రత్యేక పాత్ర.
యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు..కార్యకర్తల కోసం సంక్షేమ నిధి పెట్టి..క్యాడర్కు దగ్గరయ్యారు. మరే ప్రాంతీయ పార్టీకీ లేని విధంగా కోటికిపైగా సభ్యత్వాలతో టీడీపీ రికార్డు సృష్టించడంలో లోకేశ్‌దే కీలక పాత్ర. అలా పార్టీలో తన మార్క్ చూపిస్తూ వస్తోన్న లోకేశ్..టీడీపీ కీలక నిర్ణయాల్లో కీరోల్ ప్లే చేస్తున్నారు. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ పార్టీని సమన్వయంతో నడిపించడంలో సక్సెస్ అవుతున్నారు. దీంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు లోకేశ్కు కీలక బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆకాంక్ష క్యాడర్, లీడర్ల నుంచి బలంగా వినిపిస్తోంది.
Also Read: కవితకు కేసీఆర్ అందుకే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదా?
ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేశ్‌కు పార్టీలో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉంది. పార్టీ నేతలు, శ్రేణుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో లోకేశ్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని దానిపై కడపలో జరిగే మహానాడు వేదికగా కొందరు లీడర్లు తమ గళాన్ని వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పరిపాలన వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు లోకేశ్కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
లోకేశ్ కీలక ప్రతిపాదన
సేమ్‌టైమ్ అధినేత మినహా పార్టీలో ఎవరైనా ఒక పదవిని 3 కంటే ఎక్కువ సార్లు చేయరాదనే ప్రతిపాదనను లోకేశే తీసుకొచ్చారు. 2022లో ఒంగోలు వేదికగా జరిగిన లోకేశ్ ఈ ప్రతిపాదన చేశారు. ఈ విధానం తన నుంచే ప్రారంభం కావాలని కూడా ఆయన పలుసార్లు బహిరంగంగా చెప్పారు. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఇప్పటికే మూడు టర్ములు పూర్తి చేసుకున్నారు లోకేశ్.
ఇక తర్వాత ఆయన చేపట్టే పదవి వర్కింగ్ ప్రెసిడెoటేనన్న చర్చ పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక మినహా మిగిలిన పదవుల ప్రకటన అనేది ఉండదు. జాతీయ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఇతర పదవులపై పూర్తి అధికారం అధినేతకు అప్పగిస్తూ మహానాడు సభ తీర్మానం చేస్తుంది. అధినేత చంద్రబాబు ఇతర పదవుల ఎంపికపై తీసుకునే నిర్ణయాలకు..మహానాడు వేదికగా నాయకులు లోకేశ్‌కు ఇచ్చే బాధ్యతలపై చేసే ప్రతిపాదనలు కీలకం కానున్నాయి.