కవితకు కేసీఆర్ అందుకే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదా?
ఇలాంటి టైమ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.

ఒకే ఒక్క లెటర్ కారు పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ కవిత..కేసీఆర్‌కు రాసిన లెటర్ ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇంత గందరగోళానికి దారి తీసిన కవిత లెటర్‌పై కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావడం లేదో బీఆర్ఎస్ నేతలకు అంతుపడ్డటం లేదట. ఇదే టైమ్‌లో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాంహౌస్‌లో ప్రత్యేకంగా భేటీ అయి కవిత ఎపిసోడ్..తర్వాత పరిణామాలపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.
కవిత లేఖపై ఇంటా బయట రాజకీయ మంట రాజుకుంటూనే ఉంది. కవిత మాత్రం తన తండ్రికి తాను వ్యక్తిగతంగా లేఖ రాస్తే ఎలా బయటకు వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తాను లెటర్లు రాసినట్లు చెబుతున్నారు. అయితే కవిత లేఖ బయటికి ఎలా వచ్చిందనే దానిపై బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో పోస్టుల వార్ జరుగుతోంది. కేటీఆర్ వర్గమే లెటర్ లీక్ చేసిందని జాగృతి టీమ్ ఆరోపిస్తుంటే..కవితనే కావాలని లెటర్‌ను బయటపెట్టి..కేసీఆర్‌ను రోడ్డుకు లాగిందంటూ మండిపడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.
ఇక తాను రాసిన లెటర్‌పై రాజకీయ రచ్చ, పోస్టుల వార్ నడుస్తుండగానే..కవిత కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లెటర్ రాయడానికి కారణమేంటో..తన ఉద్దేశమేంటో చెప్పాలన్న ఉద్దేశంతో కవిత అపాయింట్‌మెంట్ అడిగితే..కేసీఆర్ నో చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. కవితను కలిసేందుకు కేసీఆర్ ఏ మాత్రం ఇష్టంగా లేరని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓ రకంగా కేసీఆర్ కవితను పక్కకు పెట్టినట్లే అంటున్నారు కొందరు కారు పార్టీ లీడర్లు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరేనా? రెండ్రోజుల్లో గుడ్‌న్యూస్?
అంతేకాదు కవిత లిక్కర్ కేసు ఆరోపణలతోనే బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం జరిగిందని..పార్టీ ఓటమికి ఆమే ప్రధాన కారణమని కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారట. అయినా కేసీఆర్ కవితను పక్కకు పెట్టలేదని..కానీ ఇప్పుడు పార్టీ అపోజిషన్‌లో ఉండి..రేవంత్ ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కవిత లెటర్ బీఆర్ఎస్‌ను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట గులాబీ లీడర్లు. కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని..అందుకే కవిత అపాయింట్‌మెంట్ అడిగినా నో చెప్తున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు.
రెండున్నర గంటల పాటు కవిత అంశంపైనే చర్చ?
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కవిత అంశంపై పెద్దగా స్పందించడం లేదు. ఆమె లేఖ రాయడం తప్పేమి కాదంటూనే.. అంతర్గత విషయాలను బహిర్గతంగా మాట్లాడటం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి టైమ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధినేత కేసీఆర్‌ను కలిసి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.
దాదాపు రెండున్నర గంటల పాటు కవిత అంశంపైనే మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇది కుటుంబానికి సంబంధించిన అంశం కావడం, అందులోనూ సున్నితమైన విషయం కావడంతో పార్టీలో ఎవరూ స్పందించకుండా చూడాలని కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. దాంతో కవిత ఎపిసోడ్‌పై కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ముఖ్యనేతలెవ్వరు రెస్పాండ్ కారన్న చర్చ జరుగుతోంది.
కవిత లెటర్‌పై ఎవరు మాట్లాడినా..మాట్లాడకపోయినా..కేసీఆర్ కనీసం ప్రెస్‌నోట్ అయినా ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరు బీఆర్ఎస్ నేతల్లో ఉందట. కేసీఆర్ మాత్రం తాను రియాక్ట్ కాకపోవడమే కాదు..పార్టీ నేతలు ఎవరూ కవిత ఎపిసోడ్‌పై మాట్లాడొద్దని చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ పిలిచి మాట్లాడకపోతే కవిత ఏదో పెద్ద డెసిషన్ తీసుకుంటున్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా..ఆమె అడిగినా కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న టాక్ మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీన్ని బట్టే కవితను కేసీఆర్ చాలా లైట్ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.
అపోజిషన్‌లో ఉన్నామ్..పైగా ఎన్నికలకు ఇంకా మూడేళ్లపైగా టైమ్ ఉంది..ఇలాంటి టైమ్‌లో కవిత పార్టీలో ఉన్నా..ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకున్నా నో ప్రాబ్లమ్ అన్న భానవలో గులాబీ బాస్ ఉన్నట్లు బీఆర్ఎస్ లీడర్లు చర్చించుకుంటున్నారు. అందుకే ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చి కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదన్న టాక్ అయితే కారు పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఆమె రాసిన లేక బయటికి లీక్ కావడంతోనే బీఆర్ఎస్‌తో కవిత బంధం తెగినట్లేనన్న ఒపీనియన్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కవిత ఎపిసోడ్‌లో కన్‌క్లూజన్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.