Ap High Court
Punch Prabhakar Case : న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి హైకోర్టు మండిపడింది. కోర్టు తీర్పులనే తప్పుబడుతూ…జడ్జీలపై కామెంట్స్ చేయడంపై పలువురు న్యాయ నిపుణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జడ్జీలపై వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో పంచ్ ప్రభాకర్ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితే..ఇక్కడ పంచ్ ప్రభాకర్ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద కామెంట్లు పెట్టిన పంచ్ ప్రభాకర్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
Read More : Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు
2021, అక్టోబర్ 29వ తేదీ శుక్రవారం.. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుపై విచారణ జరుగుతోంది. ధర్మాసనం ముందు విశాఖ సీబీఐ ఎస్పీ, యూ ట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ లు హాజరయ్యారు. పంచ్ ప్రభాకర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే అఫిడవిట్ వెయ్యాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ తోకనే కట్ చేద్దామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో..సీబీఐ జాయింట్ డైరెక్టర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని సీబీఐ న్యాయవాది సుభాష్ కోర్టుకు తెలిపారు.
Read More : Tirumala Break Darshan : తిరుమలలో 4వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
దీనిపై కోర్టు కొంత ఘాటుగానే స్పందించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నా…పోస్టులు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించింది. అభ్యంతరకర పోస్టులపై రిజిస్టర్ జనరల్ నుంచి లేఖ వస్తే…వెంటనే తొలగిస్తామని ఈ సందర్భంగా…యూ ట్యూబ్ తరపున న్యాయవాదులు చెప్పారు. పంచ్ ప్రభాకర్ వెనక రాజకీయ నేతలు ఎవరో ఉండి నడిపిస్తున్నారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీకుమార్ అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూ ట్యూబ్ కు లేఖ రాశామని సీబీఐ చెప్పింది. తమకు ఎలాంటి లేఖ రాలేదని యూ ట్యూబ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టిక తీసుకొచ్చారు. ఇక ముందు అభ్యంతరకర పోస్టులపై రిజిస్ట్రార్ జనరల్ నుంచి విజ్ఞప్తి వస్తే వెంటనే ఆ పోస్టులు వీడియోలు తొలగించాలని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ సూచించారు. మరికాసేపట్లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.