చూసేందుకు రెండు కళ్లు సరిపోవు..! వారి ఒంటిపై 25 కిలోల బంగారం, తిరుమలలో సందడి చేసిన గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ

వీరికి సెక్యూరిటీగా 10 మంది వరకు సిబ్బంది కూడా వెంట ఉన్నారు. భక్తులు, ఉద్యోగులు వీరిని ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు.

చూసేందుకు రెండు కళ్లు సరిపోవు..! వారి ఒంటిపై 25 కిలోల బంగారం, తిరుమలలో సందడి చేసిన గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ

Updated On : August 23, 2024 / 4:08 PM IST

Pune Gold Man Family : గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ తిరుమలలో సందడి చేసింది. పుణెకి చెందిన గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ (సన్నీ వాగ్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతీ సోని) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వారంతా భారీగా బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఒంటి మీద 25 కిలోల పుత్తడి ఉంది. దాని విలువ 15 కోట్ల రూపాయలు. వీరికి సెక్యూరిటీగా 15 మంది వరకు సిబ్బంది కూడా వెంట ఉన్నారు. భక్తులు, ఉద్యోగులు వీరిని ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు. వారితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

ఏదైనా మాటల సందర్భంగా నీ ఇల్లు బంగారం కాను అని అంటూ ఉంటారు. ఇల్లు బంగారం ఏమితో కానీ, వారి ఒళ్లంతా బంగారమే. ఈ బంగారం దృశ్యం తిరుమలలో దర్శనం ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఒంటి నిండా భారీగా గోల్డ్ ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన పుత్తడి ఆభరణాలు ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఇక ఈ గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీకి రక్షణగా సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.

ఈ గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీలో మొత్తం నలుగురు ఉన్నారు. వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక బాబు ఉన్నారు. పురుషులు, మహిళ ఒంటి నిండా బంగారమే ఉంది. ఒళ్లంతా గోల్డ్ చైన్లతో కప్పేశారు. ఇక మహిళ బంగారు చీర ధరించింది. మొత్తంగా ముగ్గురూ కలిసి 25 కేజీల వరకు గోల్డ్ ధరలించారు. వారి ఒంటి మీదున్న పసిడి విలువ రూ.15 కోట్లు. కోట్ల రూపాయల విలువ చేసే కిలోల కొద్దీ బంగారం ధరించి పుణెకి చెందిన గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ తిరుమలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వారిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు భక్తులు.

 

Also Read : పాత ఫోన్లు అమ్మేస్తున్నారా? సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లే.. తస్మాత్ జాగ్రత్త..!