Kodali Nani : పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురిందేశ్వరికి వాటాలు అందాయని ఆరోపించారు. అప్పుడు నోరు మూసుకున్న పురందేశ్వరి.. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Kodali Nani

Kodali Nani – Purandeswari : పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదంటూ వ్యాఖ్యానించారు. తండ్రి మరణానికి కారణమైన పురందేశ్వరి ఇప్పుడు టీడీపీకి బిటీంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురిందేశ్వరికి వాటాలు అందాయని ఆరోపించారు. అప్పుడు నోరు మూసుకున్న పురందేశ్వరి.. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అంటూ కొడాలి నాని హెచ్చరించారు. బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఇసుకపై 4వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, టీడీపీ హయాంలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చీకొట్టినా పురందేశ్వరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పురందేశ్వరి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Harish Rao : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు అసెంబ్లీలో బాహుబలి డైలాగులు చెప్పిన చంద్రబాబు…. నేడు గుండెకు బొక్క పడింది, శరీరంలో కాయలు పోయాయి అంటూ బెయిల్ కోసం డ్రామాలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితమంతా అవినీతి బొక్కలు, మచ్చలతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావులేదన్నారు. పేద వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యం అన్నారు.