Harish Rao : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్ మొదటి ఐదేళ్లలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసి మంచినీళ్లు, కరెంట్, వ్యవసాయాన్ని ఒక దరికి చేర్చారని తెలిపారు.

Harish Rao : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

Harish Rao

Minister Harish Rao : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేశారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మొదటి ఐదేళ్లలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసి మంచినీళ్లు, కరెంట్, వ్యవసాయాన్ని ఒక దరికి చేర్చారని తెలిపారు. గతంలో అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎంతో బాధగా ఉండేదన్నారు. అయితే సీఎం కేసీఆర్ నేడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేశారని కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, సింగర్ రాహుల్ సీప్లీ గంజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో రోజూ చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రెండవ సారి కేసీఆర్ సీఎం అయ్యాక విద్య, వైద్యంపై దృష్టి పెట్టారని వెల్లడించారు. 60ఏళ్లల్లో 268 గురుకులాలుంటే కేసీఆర్ సీఎం అయ్యాక వాటిని వెయ్యి గురుకులాలలకు పెంచారని తెలిపారు. గత ప్రభుత్వంలో గురుకులాలలో లక్ష 90వేల మంది విద్యార్థులు చదివితే బీఆర్ఎస్ వచ్చాక విద్యార్థులు 6లక్షలకు పెరిగారని వెల్లడించారు.

Revanth Reddy : కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం : రేవంత్ రెడ్డి

నేడు రాష్ట్రంలో 6652మంది విద్యార్థులు గురుకులాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ కు మారిన గురుకుల పాఠశాలలను త్వరలో డిగ్రీ కి అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. విదేశీ చదువులకు గత ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వకపోతే కేసిఆర్ సీఎం అయ్యాక 20లక్షల రూపాయలు ఇచ్చి చదివిపిస్తున్నారని కొనియాడారు. ఏడాదికి 4వేల కోట్లు రూపాయలు గురుకుల విద్యార్థుల కోసం ఖర్చు అవుతుందన్నారు.

జనవరి నుంచి రాష్ట్ర ప్రజలకు రేషన్ షాప్ లలో పాత బియ్యం, సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నీళ్ళ చారు, పురుగుల ఆహారం తినక హాస్టల్ విద్యార్థులు తిరిగి ఇంటికి వచ్చేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం 119నియోజక వర్గాలలో గురుకులాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.