Revanth Reddy : కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం : రేవంత్ రెడ్డి

కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నయినా సంపూర్ణంగా అమలు చేయవచ్చన్నారు. నిస్సహాయులకు చేయూతనివ్వడం ఖర్చు కాదు.. సాంమాజిక బాధ్యత అన్నారు.

Revanth Reddy : కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం : రేవంత్ రెడ్డి

Revanth Reddy (13)

Updated On : November 19, 2023 / 3:38 PM IST

Revanth Reddy : కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇస్తున్న విద్యుత్ కొంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్ గడ్ నుంచి కాదా? అని ప్రశ్నించారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్ కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నయినా సంపూర్ణంగా అమలు చేయవచ్చన్నారు.

నిస్సాహాయులకు చేయూతనివ్వడం ఖర్చు కాదు.. అది సామాజిక బాధ్యత అన్నారు. సామాజిక బాధ్యతను నిర్వర్తించడం కాంగ్రెస్ బాధ్యత అని అన్నారు. కేసీఆర్ కు రైతు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అందులో అనుమానం లేదన్నారు. అధికారం కోల్పోతున్నామన్న బాధతో కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని తెలిపారు.

Telangana Assembly Election 2023 : తెలంగాణ పోరులో వారసులు విజయం సాధిస్తారా? హోంశాఖ మంత్రుల వారసులకు దక్కని అవకాశం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన..

తెలంగాణ ఏర్పాటుఖాయమైనప్పుడు సీమాంధ్ర పాలకులు మాట్లాడినట్లు ఇవాళ బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రేషనలైజేషన్ పేరుతో 12వేల పాఠశాలలు మూసేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమని రేవంత్ అన్నారు. ప్రగతీభవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ గా మారుస్తామని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రపంచంతో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ లా ఉన్నవాటిని కూలగొట్టి కొత్తవాటిని నిర్మించే విధానాలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతుందన్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగానే బడ్జెట్ ను ఖర్చు చేస్తామని తెలిపారు.

Today Headlines : బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాబూ మోహన్ కుమారుడు.. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందే కాంగ్రెస్..
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ కు మంచిపేరు వస్తుందనే కేసీఆర్ ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందే కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, కేసీఆర్ పాలనలా నిర్బంధాలు ఉండవని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందన్నారు. నిజాం నిరంకుశ పాలన, సమైక్య పాలకుల ఆధిపత్యం, తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం అని అన్నారు. తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమి అని తెలిపారు. తెలంగాణ చరిత్ర చూస్తే ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదన్నారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని గుర్తు చేశారు.

Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య లేదు: ప్రియాంక గాంధీ

తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ ఆధిపత్య ధోరణి..

సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని పేర్కొన్నారు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని విమర్శించారు.

పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదన్నారు. అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు.

YS Sharmila : దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత సీఎం ప్రకటన చేయాలి : వైఎస్ షర్మిల

ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్ ను ప్రజల ముందుంచామని తెలిపారు. తుడి దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలన్నారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదు తెలంగాణ ఆత్మగౌరవం కోసమని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని రాచరికం అనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయని చెప్పారు. రూ.2వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చే పెన్షన్ కంటే కర్ణాటకలో పెన్షన్ తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోందన్నారు. కేసీఆర్ సవాల్ లో పస లేదన్నారు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు రూ.1లక్షా 80వేలు బాకీ ఉన్నారని తెలిపారు.

Kodali Nani : పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కు సహకరించడమే బీజేపీ వ్యూహం..
110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమే అవుతుందన్నారు. బలహీనవర్గాలు కేసీఆర్ ను ఓడించాలన్న కసితో ఉన్నారని పేర్కొన్నారు. ఆ ఓట్లను చీల్చి కేసీఆర్ కు సహకరించడమే బీజేపీ వ్యూహం అన్నారు. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు ఇప్పటికీ అతీగతి లేదని విమర్శించారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు.

దళితుల ఓట్లు కాంగ్రెస్ కు రాకుండ చీల్చేందుకే కమీటీతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. తాను మంద కృష్ణకు విజ్ఞప్తి చేస్తున్నానని ఢిల్లీ వెళదాం… మోదీని కలిసి ఆర్డినెన్స్ కు మద్దతు ఇస్తామని చెబుతానని తెలిపారు. అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఇవ్వాలని మోదీని కొరదామని తెలిపారు. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చన్నారు. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పారు.

Harish Rao : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

మోదీని కలిసి ఆర్డినెన్స్ కు మద్దతు ఇస్తామని చెబుతానని తాను మంద కృష్ణకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఇవ్వాలని మోదీని కొరదామని తెలిపారు. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చన్నారు. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుందన్నారు. కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.