YS Sharmila : దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత సీఎం ప్రకటన చేయాలి : వైఎస్ షర్మిల

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు.

YS Sharmila : దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత సీఎం ప్రకటన చేయాలి : వైఎస్ షర్మిల

YS Sharmila Comments KCR

YS Sharmila – KCR : కేసీఆర్ నోట మళ్లీ దళిత ముఖ్యమంత్రి మాట వస్తుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దళితుల ఓట్లు అవసరమైతే గానీ కేసీఆర్ కు 10 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట గుర్తుకురాలేదన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. కనీసం రెండో దఫా అయినా ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వకుండా దళిత సమాజాన్ని కించ పరిచారని తెలిపారు. దళిత వ్యక్తి పక్కన కూర్చుంటే పక్కకు నెట్టిన నీచ సంస్కృతి కేసీఅర్ ది అని అన్నారు.

కేసీఆర్ కు దమ్ముంటే, నిజంగా దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో సంక్షేమాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. మూడెకరాల భూమి నుంచి దళిత బంధు దాక, డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి కార్పొరేషన్ రుణాల దాక అన్ని మోసాలేనని పేర్కొన్నారు. దళితులకు అనునిత్యం ఆగచాట్లేనని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో దళితులపై లాఠీలు జులిపించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. దళిత మహిళలను లాకప్ డెత్ చేయించిన నియంత పాలన కేసీఆర్ ది అని విమర్శించారు.

Kodali Nani : పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ వేదికగా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిపై మాట మార్చారని తెలిపారు. సమయం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తానని చెప్పడం కొత్త కుట్రకు నిదర్శనం అన్నారు. నిజంగా దళిత బిడ్డను సీఎం చేయడానికి ఇప్పుడు సమయం లేదా అని ప్రశ్నించారు. అర్హత ఉన్న దళిత నాయకులు లేరా లేక మీ తాలిబాన్ పాలనలో అసలు దళితులకు రాజ్యాధికారం వద్దని ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు.