R5 Zone Case
Amaravati R5 Zone Case : ఆర్ 5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్ కు ఈ కేసును బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఆర్5 జోన్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అమరావతి రాజధాని కేసుతో పాటుగా ఈ ఆర్5 జోన్ వ్యవహారం కూడా విచారణ జరపాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిటిషన్లు ఉన్నాయి.
ఆర్5 జోన్ పిటిషన్ ఒక ధర్మాసనం ముందుంది. అలాగే అమరావతి రాజధాని పిటిషన్ మరొక ధర్మాసనం ముందుంది. రెండు పిటిషన్లు కూడా ఒకే ధర్మాసనం విచారించాలని చెప్పి ఈరోజు విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్జిస్ రాజేశ్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ కు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
Also Read..Dharmana Prasada Rao: పారదర్శక చిట్ ఫండ్ వ్యాపారంకోసమే ఇ-చిట్స్ ఎలక్ట్రానిక్ విధానం
కాగా.. ఆర్-5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రైతులు, టీడీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం ఆర్-5 జోన్‌పై సుప్రీంలో విచారణకు రాగా రైతుల తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్ గీ వాదనలు వినిపించారు. అయితే అమరావతి కేసుతో పాటు ఆర్-5 జోన్ కేసును కలిపి విచారణ జరపాలని నిర్ణయిస్తూ.. అమరావతి కేసును విచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు ఆర్-5 జోన్ పిటిషన్‌ను బదిలీ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. శుక్రవారంలోగానే రెండు పిటీషన్లపై విచారణకు జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్ కి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. అమరావతి ప్రజా రాజధాని కావాలంటే ప్రజలు నివసించటానికి ఇళ్ల స్థలాలు ఇస్తే తప్పేంటని ప్రభుత్వం వాదిస్తోంది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.