Dharmana Prasada Rao: పారదర్శక చిట్ ఫండ్ వ్యాపారంకోసమే ఇ-చిట్స్ ఎలక్ట్రానిక్ విధానం
రాష్ట్రంలో పారదర్శకంగా చిట్ ఫండ్ వ్యాపారం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానం ప్రారంభిస్తున్నాం.

Minister Dharmana
Dharmana Prasada Rao: రాష్ట్రంలో పారదర్శకంగా చిట్ ఫండ్ వ్యాపారం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానం ప్రారంభిస్తున్నామని రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం ఇ చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను మంత్రి ధర్మాన ప్రారంభించారు. చందాదారులు అంతా ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు.
చందాదారులు మోసపోకుండా చూడాలనే ఈ విధానం ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు అన్‌లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారని మంత్రి ధర్మాన అన్నారు.
ఈ నూతన విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్‌లు నిర్వహించాలని, గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానం లోకి రావాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.