Raghu Rama Krishna Raju: పొత్తులో టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ..: రఘురామకృష్ణరాజు

నాలుగేళ్ల తర్వాత సొంతూరులో అందరి మధ్య సంక్రాంతి చేసుకోవడం ఆనందంగా ఉందని రఘురామకృష్ణరాజు తెలిపారు.

MP Raghurama Krishnamraj

ఎన్నికల వేళ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. బీజేపీ కూడా పొత్తులో ఉంటుందని రఘురామకృష్ణరాజు అనడం గమనార్హం.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 10టీవీతో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. తాను పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా మళ్లీ నర్సాపురం పార్లమెంట్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. నియోజవర్గంలో ప్రజలు తనపై కుదిరిస్తున్న ఆదరణ, ప్రేమ మరువరానిదని చెప్పారు.

నాలుగేళ్ల తర్వాత సొంతూరులో అందరి మధ్య సంక్రాంతి చేసుకోవడం ఆనందంగా ఉందని రఘురామకృష్ణరాజు తెలిపారు. రాజకీయ మనుగడ కోసం తనపై అనవసరమైన కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకోనని, రియాక్షన్ కూడా అలాగే ఉంటుందని హెచ్చరించారు.

మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తన పోటీపై క్లారిటీ ఇచ్చారు రఘురామకృష్ణరాజు.

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు