మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి, వెంటనే అరెస్టు చేయాలి: ఎంపీ రఘునందన్‌ రావు

అయ్యప్ప మాలలో ఉన్నాడన్న విషయాన్ని కూడా గ్రహించకుండా రిపోర్టర్‌పై ఇష్టారీతిగా దాడి చేశారని తెలిపారు.

Raghunandan Rao

మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు చేసిన దాడిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఇది ఒక వ్యక్తిపై, ఒక సంస్థపై జరిగిన దాడిగా చూడొద్దని, యావత్ మీడియాపై జరిగిన దాడిగా చూడాలని అన్నారు.

మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పగలు, రాత్రి, ఎండ, వానా తేడా లేకుండా వార్తల కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి అమానుషమని చెప్పారు. ఇంట్లో కూర్చుని చక్కదిద్దుకోవాల్సిన సమస్యను మోహన్ బాబు లాంటి పెద్దమనిషి రోడ్డుపైకి తెచ్చుకున్నారని తెలిపారు.

జర్నలిస్టులు తమంతట తాముగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లలేదని అన్నారు. ఎన్నో సినిమాల్లో నటించి జాతీయ అవార్డులు పొంది, ఎంపీగానూ పనిచేసిన మోహన్ బాబు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు.

అయ్యప్ప మాలలో ఉన్నాడన్న విషయాన్ని కూడా గ్రహించకుండా రిపోర్టర్‌పై ఇష్టారీతిగా దాడి చేశారని తెలిపారు. జర్నలిస్టులు రాసే వార్తలు కొందరికి ఇబ్బంది కల్గించవచ్చని, దానికి చట్టపరంగా వ్యవహరించాలని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం, భౌతిక దాడులకు దిగడం ఏ రాజకీయ నాయకులకు తగదని చెప్పారు.

Mohan Babu : రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి.. మూడుచోట్ల విరిగిన ఎముకలు..