Rahul Gandhi skips gujarat and himachal assembly elections
Rahul Gandhi on Amaravati: ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. హాలహర్వి నుంచి ఆలూరు హులేబీడు, మనేకుర్తి, ఆదోని మండలం శాగి గ్రామం వరకు ఇవాళ ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని, ఈ మేరకు మద్దతు తెలిపాలని రాహుల్ ను రైతులు కోరారు.
దీంతో రాహుల్ మాట్లాడుతూ.. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని కావాలని, అక్కడి రైతుల పోరాటానికి తాను సంఘీభావం తెలుపుతున్నానని చెప్పారు. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. పోలవరం నిర్వాసిత రైతులకు కూడా తమ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, ఇవాళ రాత్రి రాహుల్ గాంధీ ఆదోని మండలం శాగి గ్రామం వద్ద బస చేస్తారు. ఆయన పాదయాత్రలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..