ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్‌నెస్ తక్కువే. అది స్టేట్‌కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్‌గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఓ జాతీయ పార్టీగా రాష్ట్రంలో దానిని నిలబెట్టేందుకు ప్రయత్నించాల్సిన సమయంలో పూర్తిగా గాలికొదిలేసింది పార్టీ అధిష్టానం. అంది వచ్చిన అవకాశాల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని రచ్చ వేడి పుట్టిస్తోంది. పార్టీని పరుగులు పెట్టించాల్సిన సమయంలో సైలెంట్‌గా ఉండిపోయే రాహుల్ గాంధీ మొత్తం మీద 50 రోజుల అమరావతి ఉద్యమం తర్వాత స్పందించారు. తాము మూడు రాజధానులకు వ్యతిరేకంగా చాలా స్పీడ్‌గా అత్యంత లేట్‌గా ప్రకటించేశారు.
జగన్‌ను ఇరకాటంలో పెట్టాలని :
చాలా కాలం పాటు పీసీసీకి అధ్యక్షుడిని కూడా నియమించకుండా ఖాళీగా వదిలేసిన అధిష్టానం ఈ మధ్యనే శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత నెమ్మదిగా రాజధాని విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు, ప్రదర్శనలు మొదలుపెట్టారు పార్టీ నేతలు. ఈ సమయంలో జగన్‌ను ఢీకొనేందుకు రాహుల్ ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతున్నారట. కాంగ్రెస్ పార్టీ ఇలా దెబ్బ తినడానికి కారణం వైఎస్ జగన్ అన్నది కాంగ్రెస్ హైకమాండ్ భావన. తమను ఎదిరించి, ఓదార్పు యాత్రలు చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్‌ను ఇరకాటంలో పెట్టాలని రాహుల్ భావిస్తున్నారట. కానీ, ఇష్యూల మీద పోరాడేటప్పుడు రాహుల్ గాంధీలో సీరియస్‌నెస్ లోపిస్తుందనే టాక్ ఉంది. అమరావతి ఇంత కాలంగా రగిలిపోతుంటే కనీసం స్పందించని రాహుల్.. 50 రోజుల తర్వాత మొదలుపెట్టడం వల్ల లాభం ఉంటుందా అనేది ప్రశ్న.
రాష్ట్రంలో అన్ని పార్టీలు అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు నిద్ర లేచింది. కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తయ్యే వరకూ ఎందుకని అనుకుందో ఏమో గానీ.. మొత్తం మీద ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉండిపోయింది. మీరంతా మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడండి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను వస్తానని రాహుల్ కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేశారు. కానీ, రాహుల్ ఎలా నమ్మాలన్నదే ఇప్పుడు పార్టీ వర్గాలను వేధిస్తోన్న ప్రశ్న అని జనాలు అనుకుంటున్నారు. అంశాలపై పోరాటాన్ని సీరియస్‌గా తీసుకోవడం రాహుల్‌లో ఇప్పటి వరకూ చూడలేదన్నది పార్టీ వర్గాల్లో వినిపించే మాటే.
రాహుల్ ఢీకొనగలరా? :
మరోపక్క తన నిర్ణయాలను అమలు చేసేందుకు జగన్ ఎంత మొండిగా ముందుకు వెళ్తారో తెలిసిందే. మరి అలాంటి బలమైన జగన్‌ను రాహుల్ ఢీకొనగలరా అనే డౌట్ సొంత పార్టీలోనే ఉందంటున్నారు. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా జగన్ మొండిగా ముందుకు వెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు ఇప్పటికే మూడు రాజధానులను వ్యతిరేకించాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తోంది. అయినా జగన్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరి రాహుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి రాజధాని అంశంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పడం చూస్తుంటే.. పార్టీలోనే నమ్మబుద్ధి కావడం లేదంటున్నారు. దేని మీదైనా పోరాటం ప్రారంభించి ఆ తర్వాత కనిపించకుండా పోవడం ఇప్పటికే చాలాసార్లు చూసి ఉండడంతో ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయని జనాలు అనుకుంటున్నారు.