విజయవాడ మీదుగా వెళ్లే 132 రైళ్లు రద్దు.. మరో 93 రైళ్లను..

ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. 

Train

భారీ వర్షాల కారణంగా పట్టాలపై నీళ్లు చేరడంతో విజయవాడ మీదుగా వెళ్లే 132 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 93 రైళ్లను దారి మళ్లించారు. కొండపల్లి, రాయనపాడులో పట్టాలపై నీరు చేరడంతో మూడు రైళ్లు అక్కడే ఆగిపోయాయి. 40 ప్రత్యేక బస్సుల్లో 2 వేల మందిని విజయవాడ స్టేషన్‌కు తరలించారు.

ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. మరోవైపు, కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కంచికచర్ల మండల పరిధిలోని కీసర మునేరు వరద ఉద్ధృతి పెరగటంతో జాతీయ రహదారిపై నీరు ప్రవహించి కీసర టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు గంటల నుంచి ఈ ట్రాఫిక్ లోనే ఉన్నామని ప్రజలు అంటున్నారు. తినడానికి తిండి, తాగటానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఏపీలో మరో 24 గంటల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటకే ప్రకటించారు.

బయటకు రావద్దు..! రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు..!

ట్రెండింగ్ వార్తలు