Heavy Rains AP: ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో భారీ వర్ష సూచన

రాబోయే రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy Rains AP: రాబోయే రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Balakrishna : బింబిసారపై బాలయ్య ప్రశంశలు.. ఇలాంటివి నందమూరి వంశానికే దక్కుతాయి.. డైరెక్టర్ కి బాలయ్య సినిమా ఛాన్స్..

ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళంలో వాతావరణం మారింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైజాగ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు రాజమండ్రి, ఏలూరులో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పాడేరు, పార్వతీపురంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఇంకా వరద నీటినుంచి బయటపడలేదు. జలదిగ్బంధంలోనే ఈ మండలాలు చిక్కుకున్నాయి. కుక్కునూరు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం స్థానిక ప్రజలను వెంటాడుతోంది.

Pampanur Subrahmanyeshwar : ఏడు శిరస్సులతో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు, పంపనూరులో ప్రసిద్ధ దేవాలయం

రాయలసీమ ప్రాంతంలోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45–55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తూ సముద్రం అలజడిగా ఉంటుందని, ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు