Rain Prediction: మరో మూడ్రోజులపాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం మధ్యాహ్నం అందిన వివరాల ప్రకారం..

Rain

Rain Prediction: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం మధ్యాహ్నం అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరక్టర్ నాగరత్నం మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో గత నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. చత్తీస్‌ఘడ్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండటంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా చురుగ్గా కదులుతుంది.

మరో మూడు రోజులు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 సంవత్సరాల తరవాత మళ్ళీ ఇలాంటి భారీ వర్షాలు పడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం మన వైపుగా నైరుతి పవనాలు చాలా బలంగా చురుగ్గా కదులుతుండటంతో ఎగువున కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతి పెరుగుతుంది.

Read Also : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..రెండు రోజులపాటు వర్షాలు

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పడాల్సిన వర్షపాతం కంటే 101 శాతం అధికంగా పడినట్లు తెలుస్తోంది.