Visakhapatnam : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..రెండు రోజులపాటు వర్షాలు

అల్పపీడనానికి రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Visakhapatnam : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..రెండు రోజులపాటు వర్షాలు

Visakha

Visakhapatnam : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో మోస్తారు వర్షాలు కురువనున్నాయి. ఒకటి, రెండ్లు చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అల్పపీడనానికి రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్లు నుండి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. లోయర్ కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ ముంపునకు గురైంది. పూర్తిగా గోదావరిలో మునిగిపోయింది. దీంతో పోలవరం పనులు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

Polavaram Project : గోదావరి ఉగ్రరూపం..పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం

అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి. బలహీనంగా ఉన్న గోదావరి కథలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది.

తెల్లవారుజామున 4 గంటల వరకు 11,62,923 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12.80 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటల వరకు 12,10,532 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.20 అడుగులకు చేరింది. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు 175 గేట్లు ఎత్తివేశారు. లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.