Polavaram Project : గోదావరి ఉగ్రరూపం..పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం

పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి.

Polavaram Project : గోదావరి ఉగ్రరూపం..పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం

Polavaram

Polavaram project : ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్లు నుండి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. లోయర్ కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ ముంపునకు గురైంది. పూర్తిగా గోదావరిలో మునిగిపోయింది. దీంతో పోలవరం పనులు నిలిచిపోయాయి.

పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి. బలహీనంగా ఉన్న గోదావరి కథలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Godavari : భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం..చివరి ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. తెల్లవారుజామున 4 గంటలకు 11,62,923 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12.80 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటల వరకు 12,10,532 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.20 అడుగులకు చేరింది. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు 175 గేట్లు ఎత్తివేశారు. లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.4 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం ఆలయ మాడవీధులు, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్సును వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 597 మందిని అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు.

AP Rains : ఏపీలో విస్తారంగా వర్షాలు-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం

కిన్నెరసాని ఉధృతితో బూర్గంపాడు మండల కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. దుమ్ముగూడెం బ్యారేజీకి ఏకంగా 14.45లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. తుపాకులగూడెం బ్యారేజీకి 11.69 లక్షల క్యూసెక్కులు, కాళేశ్వరంలోని మేడిగడ్డ 8.50లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీలోకి లక్షా 95వేల క్యూసెక్కల వరద వస్తోంది.