Raj Kasireddy Audio: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులపై రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. లిక్కర్ కేసులో నాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలన్నారని ఆయన చెప్పారు. నోటీసులపై 24 గంటల్లోనే నేను స్పందించాను.. నన్ను ఎందుకు రమ్మంటున్నారని అడిగాను అని అన్నారు. ఏమైనా డాక్యుమెంట్స్ తేవాలా అని అడిగాను.. విచారణకు నేను సహకరిస్తానని చెప్పా.. నేను మెసేజ్ పెట్టాక రెండో నోటీసు ఇచ్చారు అని తెలిపారు.
Also Read: విజయనగరం పోలీస్ స్టేషన్‌లో నటి శ్రీరెడ్డి.. ఆ కేసులో విచారించిన పోలీసులు..
‘కేసులో ప్రాథమిక సమాచారం ఇవ్వాలని కోరా.. మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. నేను లేని టైమ్‍లో మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సాక్షిగా నాకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. సాక్షిగా విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని లాయర్లు చెప్పారు.
నాకు వచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేశా. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశా. న్యాయ సలహా తీసుకున్నాక విచారణకు వస్తా. విజయసాయిరెడ్డి చరిత్రను అందరి ముందు పెడతా. అప్పటివరకు ఒక సైడ్ వార్తలు వేయకండి’ అని ఆ ఆడియో మెసేజ్ లో ఉంది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here