Minister Dadisetti Raja : రజినీకాంత్, చంద్రబాబు.. ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలి : మంత్రి దాడిశెట్టి రాజా
రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించరని, పొత్తుల సీట్లు గురించి చర్చిస్తారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఫ్లాప్ షోగా మంత్రి అభివర్ణించారు.
- bheemraj
- Published On : May 1, 2023 / 12:44 PM IST
Minister Dadisetti Raja
Minister Dadisetti Raja : రజినీకాంత్ కి తాము క్షమాపణ చెప్పడం కాదు రజినీకాంత్, చంద్రబాబు ఇద్దరూ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న రజనీకాంత్ లెజెండరీ ఎందుకు అవుతాడని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి దాడిశెట్టి రాజా 10tvతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొన్నటి వరకు తాము కూడా రజినీకాంత్ ని లెజెండరీ పర్సన్ అనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడం కొత్త కాదన్నారు. 2014 నుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న పరిస్థితుల గురించి హైదరాబాదులో కూర్చుని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారా అని ఎద్దేవా చేశారు.
Chandrababu Naidu: రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..
రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించరని, పొత్తుల సీట్లు గురించి చర్చిస్తారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఫ్లాప్ షోగా మంత్రి అభివర్ణించారు. కావాలంటే ఇంకా వేరే పార్టీని కూడా కలుపుకొని రండి అని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తమ అధికారులు, మంత్రులు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారని, పంట నష్టంపై అంచనా వేస్తారని తెలిపారు. గతంలో జరిగిన పంట నష్టాలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు హయాంలో పంట నష్టం సహాయం ఇవ్వలేదని ఆరోపించారు.
