ramakrishna babu velagapudi counter to visakhapatnam mp mvv satyanarayana
Ramakrishna Babu Velagapudi : ఎంపీ ఎంవీవీ సత్యరాయణ తనపై చేసిన వ్యాఖ్యలకు విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ సత్యరాయణ భూకబ్జాలకు పాల్పడ్డారని, ఎంపీగా వైజాగ్‌కు చేసిందేమీ లేదన్నారు. వంగవీటి రంగా హత్య కేసులో తన ప్రమేయం ఉందని ఎంపీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఎంపీ సత్యరాయణపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో ఎమ్మెల్సీ వంశీకృష్ణని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారని అన్నారు.
ఎంపీ ఎంవీవీ నువ్వు భూ భక్షకుడవు, టీడీపీ భూరక్షకులు. వైజాగ్ భూ కుంభకోణాల్లో వున్న వ్యక్తివి. నువ్వు ఓ దిక్కుమాలిన బిల్డర్‌వి. నేను, వంశీ కలిసివుంటే నీకెందుకు బాధ. నవ్వు దస్పల్ల భూకబ్జాల్లో విజయసాయిరెడ్డి కన్నా నువ్వే ఎక్కువ నొక్కేశావని ఆయనే స్వయంగా చెప్పారు. కల్తీ మద్యం చేశానని అంటున్నావు.. నామీద ఒక్క కల్తీ కేసు కూడా లేదు. భూ కబ్జాలు చేసినట్టు మీపైన బోలెడన్ని కేసులున్నాయి. నేను రంగాని చంపానని అంటున్నావు, పార్టీల్లో ఒకరిపై ఒకరు తప్పుడు కేసులు పెట్టుకుంటారు. అదేవిధంగా నా మీద ఆ కేసు పెట్టారు. ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. నా మీద ఆరోపణ చేసినందుకుగాను నీ మీద పరువు నష్టం దావా వేస్తా. నీకు ఓపెన్ చాలెంజ్ చేస్తున్న దమ్ముంటే రంగా కేసు రీ ఓపెన్ చెయ్. నేను హత్య చేసినట్లు నిరూపించగలవా? నీ కుంభకోణాల గురించి చెప్పాలంటే రెండు రోజులు కూడా సరిపోవు.
Also Read: రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా.. విశాఖ ఎంపీ కామెంట్స్
ఎంపీగా నాలుగున్నర సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు వైజాగ్‌లో కనిపించావా? నేను నీ వెంట్రుక పీకలేనన్నావు, ప్రజలే నిన్ను వచ్చే ఎన్నికల్లో సముద్రంలో పడేస్తారు. మా ప్రభుత్వం వచ్చాక వైజాగ్‌లో భూకబ్జాలు జరిగితే నేను రాజీనామా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సైకో జగన్ తో పాటు నువ్వు ఓడిపోతావు. విశాఖ ప్రజలకి తెలుసు, నువ్వేంటి నేనేంటో. నా నమ్మకం నువ్వే జగన్ అని మీలా మేము అనము, మా నమ్మకం ప్రజలే. మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. టీడీపీ పెట్టినప్పటి నుంచీ ఈ రోజు వరకు యాదవ కులం మా పార్టీకే సపోర్ట్ చేస్తున్నారని వెలగపూడి రామకృష్ణ అన్నారు.